గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి లో జరిగే గంగమ్మ జాతరలో భాగంగా డిసెంబర్ రెండవ తారీఖున జరిగే గంగ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు పార్టీలకతీతంగా గ్రామ పెద్దలతో కలిసి జాతరను నిర్వహిద్దాం అన్నారు గ్రామ పెద్దలు పోలీసులు పంచాయితీ రెవెన్యూ అధికారులతో శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు గంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి గంగమ్మ జాతర విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.