పత్తికొండ: వెల్దుర్తి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ నేతలు ఎమ్మెల్యేకు వినతి పత్రం
వెల్దుర్తి మండలంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి టి. కృష్ణ మాట్లాడుతూ, కొండల్లో, గుట్టల్లో కాకుండా అనువైన స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.