ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : కన్నాయిపల్లి గ్రామంలో అంగన్వాడి పాఠశాలలో ఆటపాటలతో బోధన
రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామంలో అంగన్వాడి పాఠశాలలో ఆటపాటల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ డే కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను అభ్యసించడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సుశీల తెలిపారు. దీనివల్ల పిల్లల్లో శారీరక సామాజిక వ్యక్తిగత మేదో వికాసంతో పాటు భాష అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. చిన్నారులతో అంగన్వాడీ కార్యక్రమాలను ప్రదర్శన చేయించారు. అనంతరం పిల్లల అభివృద్ధి పరిశీలన కార్డులను తల్లులకు అందించారు.