పెద్దపల్లి: రేషన్లో ప్లాస్టిక్ బియ్యం సరఫరా అనే ప్రచారం అవాస్తవం: జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ డి.వేణు
జిల్లాలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యం లో ప్లాస్టిక్ బిల్డింగ్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అదనపు కలెక్టర్ డి.వేణు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి, సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు.