పబ్లిక్ న్యూస్ కథనాలకు స్పందన.. ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు: రాయచోటి డిఎస్పీ క్రిష్ణ మోహన్ హెచ్చరిక
పబ్లిక్ న్యూస్ కథనాలకు అన్నమయ్య జిల్లా రాయచోటి డిఎస్పీ ఎంఆర్ క్రిష్ణ మోహన్ స్పందించారు. సమస్యలు,సంఘటనలను ఫిర్యాదు దారులు పోలీసులకు తెలిపిన మరియు తెలిసిన వెంటనే స్పందించాలన్నారు. ఫిర్యాదుదారులు పట్ల దురుసుగా ప్రవర్తించే పోలీసుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలికిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు పై వచ్చిన పబ్లిక్ న్యూస్ కథనాలకు రాయచోటి డిఎస్పీ ఎం ఆర్ క్రిష్ణ మోహన్ స్పందించారు. కలికిరి పోలీస్ స్టేషన్లో కొంతమంది సీనియర్ పోలీసు అధికారుల పనితీరు, అవినీతి ఆరోపణల పై పబ్లిక్ న్యూస్ ప్రతినిధితో ఆరా తీశారు. పోలీసుల పనితీరు మార్చుకోని వారి పై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు