గుంతకల్లు: గుత్తిలో శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా లేని 2 గంటపాటు భారీ వర్షం.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం
అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఎడతెరిపి లేకుండా సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. గత రెండు నెలలుగా ఒక్క పూతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు