ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. గత నెల రోజులుగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు .ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం కడప జిల్లా పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన పరికరాలను గుంటూరుకు తరలిస్తుందని చెప్పారు. మెడికల్ కళాశాలలోని పరికరాలను తరలించకుండా ఆపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.