ఓటమి అనే పదమే తెలియని వ్యక్తిత్వం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్ బాబు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు.బీహార్ రాష్ట్రంలోని చాంద్వా జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, దేశ రాజకీయాల్లో అపూర్వ స్థానాన్ని సంపాదించారని ఆయన గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆయన కేంద్ర మంత్రిగా, ఉప ప్రధాని పదవులను అలంకరించారని తెలిపారు.సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్న జగ్జీవన్ రామ్ విద్యార్థి ద