పత్తికొండ: వెల్దుర్తిలో ఎమ్మార్వో కి మెడికల్ కళాశాల ప్రైవేటుకరణ ఆపాలని వినతిపత్రం
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపి, జీవో 590ని వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ గురువారం చేశాయి. వెల్దుర్తి ఎమ్మార్వో చంద్రశేఖర్ వర్మకు వారు వినతిపత్రం సమర్పించారు. పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలు కార్పొరేట్ వర్గాల చేతుల్లోకివెళ్లి, పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని ఏపీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర సభ్యుడు సురేంద్ర యాదవ్ తెలిపారు.