కట్టంగూర్: మండలంలో వ్యవసాయ బోరు బావుల వద్ద మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, అడిషనల్ ఎస్పీ వివరాలు వెల్లడి
నల్గొండ జిల్లా, కట్టంగూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. కట్టంగూరు మండలంలో వ్యవసాయ బోరు బావుల వద్ద విద్యుత్ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.13.61 లక్షల విలువైన 14 మోటార్లు, 33 బోర్ పైపులు, 8 బ్యాటరీలు, రెండు చైర్లు, సామాగ్రి, ట్రాలి ఆటో స్వాధీనం చేసుకొని, రూ.1.74 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు నకిరేకల్ కు చెందిన పాత నేరస్తులుగా గుర్తించామని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు.