బాల్కొండ: కమ్మర్పల్లి మండల పరిధిలోని రైతులకు సొసైటీ గోదాముల్లో సరిపడా యూరియా ఉంది: మండల వ్యవసాయాధికారి రమ్యశ్రీ
కమ్మర్పల్లి మండల పరిధిలోని రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయాధికారిని రమ్యశ్రీ తెలిపారు, కమ్మర్పల్లి మండలంలోని కమ్మర్పల్లి, ఉప్లూర్, హసకొత్తూర్, కొనసముందర్,కొనపూర్,సొసైటిల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు, యూరియా కావలసిన వారు ఆధార్ కార్డు,పట్టా పాస్ బుక్, తీసుకుని దగ్గరలోని సొసైటీ కి వెళ్లి యూరియా తీసుకోవచ్చని మండల వ్యవసాయాధికారి రమ్యశ్రీ తెలిపారు,