ఇబ్రహీంపట్నం: మన్సురాబాద్ లో బాలుడిపై వీధి కుక్కల దాడి, ఘటన స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
మన్సురాబాద్ డివిజన్లోని శివగంగా కాలనీలో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొప్పులు నరసింహారెడ్డి మంగళవారం ఉదయం ఘటన స్థలానికి చేరుకొని ప్రవేశించారు. బాలుడిని తక్షణ వైద్యం కోసం నల్లకుంట ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విపరీత కుక్కల బెడదతో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని అధికారులకు పట్టింపు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఈ ఘటన గురించి అధికారులకు తక్షణ సమాచారం అందజేసి అవసర చర్యలు తీసుకోవాలని కోరారు.