అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామంలో గద్దెరాళ్ళ కొండపై వెలసిన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవి సమేత తిమ్మప్ప స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం వేకువజాము నుంచి ఆలయంలో అర్చకుడు సుధీంద్రనాథ్ తిమ్మప్ప స్వామికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అలంకరించి దివ్య కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా స్వామికి విశేష అభిషేకాలు, లక్ష్మీనారాయణ హోమం, పల్లకి సేవ, వసంతోత్సవం, దీపాలంకరణ సేవ, నామ సంకీర్తన, ఊయల సేవ తదితర పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.