అగ్నిసాక్షిగా ముడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్య కు కాల యముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో బార్యను బండరాయితో తలపై మోదిన ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న బార్య శివగంగమ్మ ను స్థానికులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు. కాగా ఘటన స్థాలాన్ని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యాయత్నం చేసిన భర్త సుంకన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.