సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట వెంకటాపురం బద్దలాపురం గ్రామంలో 8:30 నుంచి 10:30 గంటల వరకు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరై ఎన్టీఆర్ పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 3000 రూపాయల పింఛన్లను నాలుగు వేలకు పెంచి లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులు టిడిపి నేతలు పాల్గొన్నారు.