చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం కారును లారీ ఢీకొనడంతో కారు ధ్వంసం అయింది పీలేరు వైపు నుంచి చిత్తూరు వైపునకు కారు వెళుతుండగా ఇదే మార్గంలో వెళ్తున్న లారీ ఐచర్ వాహనాలు కారుకు ఇరువైపులా ఢీకొన్నాయి. దీంతో కారు ధ్వంసం కాక కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.