బేతంచెర్ల మండలంలో చెరువులలో అక్రమంగా మట్టి తవ్వకాలు, అడ్డుకున్న రైతులు
Dhone, Nandyal | Dec 2, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పెండేకల్ గ్రామంలోని చెరువు కట్టపై భారీ ఎత్తున జరుగుతున్న మట్టి తవ్వకాలు ఉద్రిక్తతకు దారితీశాయి. జేసీబీలతో మట్టిని తవ్వి లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తుండటంపై మంగళవారం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల చెరువు కట్ట బలహీనపడి రాబోయే వర్షాకాలంలో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.