దేవరకద్ర: మదిగట్ల గ్రామ శివారులో ఆకస్మాత్తుగా కారులో మంటలు...
అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామ శివారులో గురువారం సాయంత్రం 6:30 గంటలకు చోటుచేసుకుంది. ఈ విషయంపై భూత్ఫూర్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఘణపురంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కిషోర్ తోటి ఉద్యోగితో కలిసి కారులో పాలమూరు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో మద్దిగట్ల గ్రామ శివారులోకి రాగానే అకస్మాత్తుగా కారు ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. వారు కారు నుంచి బయటకు రాగ.. ఒక్కసారి మంటలు చెలరేగి పూర్తిగా కారు దగ్ధమైందని శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలిపారు.