తాడేపల్లిగూడెం: రేపు 22న తాడేపల్లిగూడెంకు రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేవీ మాల్ సెంటర్ లో బహిరంగ సభ.
ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో పవన్ ఒక సైనికుడని, ఆయనకు పెద్ద చంద్రబాబు అని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలోని జీవీ మాల్ సెంటర్కు రానున్నారని తెలిపారు. బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబ్జి, సురేష్ తదితరులు పాల్గొన్నారు