కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరం సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పిడుగురాళ్ల కు చెందిన సాతులూరి రాంబాబుగా స్థానికులు గుర్తించారు. కొంతకాలంగా వచ్చాక కూలీగా పనిచేస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తి చేసి మృతుడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.