కొత్తకోట: పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశి రెడ్డి నామినేషన్ కు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అనంతరం మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుండి cm రేవంత్ రెడ్డి రోడ్ షో ప్రారంభమైంది.ఈ రోడ్ షోలో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.అనంతరం రేవంత్ ప్రజలకు అభివాదం చేస్తూ భారీ జన సందోహం నడుమ ముందుకు కదిలారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా mla లు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.