జిల్లా కేంద్రం మారుతుందేమో అన్న భయం ప్రజలలో ఉంది. కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలి:సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు
పుట్టపర్తి కేంద్రంగా సత్య సాయి జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిందని అయితే ఇటీవల కాలంలో జిల్లా కేంద్రం ఇక్కడ ఉంటుందా మరో ప్రాంతానికి తరలి వెళుతుందన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. పుట్టపర్తిలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు మాట్లాడుతూ పుట్టపర్తి జిల్లా కేంద్రమని ప్రకటించి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోతోందని చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు చేశారన్నారు.