ఆలూరు: గ్రామకంఠం ఎస్సీ కమ్యూనిటీ హాల్ స్థలంలో కబ్జా చేసిన ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్: వసంత
Alur, Kurnool | Dec 1, 2025 ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిలేకల్ గ్రామంలో గ్రామ కంఠస్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయించారని, అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన వెంకటేశ్వర్లు ఇల్లు నిర్మాణం చేపట్టడానికి పనులు చేపట్టడం జరిగిందని, సోమవారం వైసిపి మండల క్రిస్టియానిటీ సేల్ అధ్యక్షుడు వసంత నాయుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి ఎస్సీలకు మేలు చేయాలని వారు అన్నారు. అడగడానికి వెళితే దాడులకు పాల్పడుతున్నాడు అన్నారు