కలికిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా కె. రామచంద్ర బాధ్యతలు స్వీకరణ
కలికిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా కె. రామచంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వులు మేరకు రాయచోటి ఎస్.టి.ఎఫ్ నుంచి బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐ గా పనిచేస్తున్న ఎస్.అనిల్ కుమార్ బదిలీపై వెళ్లారు. నూతన సీఐ రామచంద్ర కు పోలీస్ సిబ్బంది శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. నూతన సీఐ మాట్లాడుతూ కలికిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.గజ్జెలవారి పల్లి గ్రామంలో సాయంత్రం 7:30గంటలకు సైబర్ నేరాల పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు