కొల్లాపూర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని కోడేరు సమీపంలో వ్యక్తికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
కోడేరు సమీపంలోని కోడేరు పసుపుల ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గుర్తించి గాయాలపాలైన వ్యక్తిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు వాహనాన్ని ఢీకొన్న వ్యక్తులు మైసమ్మ జాతరకు వెళుతున్న వారుగా అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులతో వెళ్లిన ద్విచక్ర వాహనంపై ఉన్న వారు వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు బాధితుడు తెలిపారు.