గరిడేపల్లి: వాగులు దాటకుండా అప్రమత్తంగా ఉండండి: ఫోనుగోడులో కలెక్టర్ తేజస్
రాబోయే 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గరిడేపల్లి(M) పొనుగోడులోని ఊర చెరువుకు వెళ్లే వాగును ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో ప్రజలు వాగు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాక, అవసరమైతే సహాయక చర్యల కోసం ప్రభుత్వ కార్యాలయంలో రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు.