ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్, చిలుపూర్ మండలాల్లో వాహనాల తనిఖీలు రూ.2.49లక్షల నగదును పట్టుకున్న పోలీసులు
స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్, చిలుపూర్ మండలాల పరిధిలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు వాహనాలను తనిఖీ చేయగా రెండు మండలాల పరిధిలో రూ.2.49 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలుపూర్ మండలం వెంకటాద్రి పేట గ్రామంలో ఎస్సై రాజేందర్ వాహనాల తనిఖీ చేయగా వెంకట్రాజం వాహనంలోని రూ.1.49లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఘన్ పూర్ మండలం మాన్ సింగ్ తండాకు చెందిన రవీందర్ రూ.లక్ష తీసుకువెళుతుండగా సీఐ రాజు తనిఖీ చేయగా బయట పడ్డాయి. రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో పట్టుకున్న నగదును త్రీ మెన్ కమిటీకి అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.