మంత్రాలయం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన పెద్ద కడబూరు పీహెచ్సీ సిబ్బంది
పెద్ద కడబూరు: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పెద్దకడబూరు పీహెచ్సీలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి ఖేజియా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్ఐవి అసురక్షిత శృంగారం, కలుషిత సూదులు, సిరంజిలు, తల్లి నుంచి బిడ్డకు మాత్రమే సోకుతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.