ఫరూక్ నగర్: ఫరూక్నగర్ మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఫారుక్ నగర్ మండలంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. రీగల్ ఫంక్షన్ హాల్ వద్ద దాదాపు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.