రాజేంద్రనగర్: శంకర్పల్లి ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో యువకుడిని చితకబాదిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి లో మద్యం తాగి వాహనం నడిపిన యువకులను పోలీసులు చితకబాదారు. శంకర్పల్లి రోడ్ లోని గవర్నమెంట్ కాలేజీ వద్ద చేవెళ్ల పోలీసులు డ్రంక్ ఏంటిరా తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు పట్టుబడిన మహేష్ అక్కడినుండి తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో ట్రాఫిక్ సిఐ వెంకటేశం, ట్రాఫిక్ సిబ్బంది తన్నుతూ రోడ్డుపైకి తీసుకొచ్చారు. అయితే విధులకు ఆటంకం కలిగించాలని పోలీసులు యువకుడు పై కేసు కూడా నమోదు చేశారు.