అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సామాన్య ప్రజలు బతికే పరిస్థితి కనిపించడం లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందించిన అనంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు.