భీమవరం: బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన నివాళి
సమైఖ్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు అన్నారు. బీజేపీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం 6 గంటలకు జనసంఘ్ వ్యవస్థాపకులు, కేంద్ర మాజీ మంత్రి శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని రాయలంలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ విగ్రహం వద్ద నిర్వహించారు. వబిలిశెట్టి ప్రసాద్, అడబాల శివ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.