కుప్పం పర్యటనలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ ని స్థానిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కడా పిడి వికాస్ మరమ్మత్, మునిసిపల్ చైర్మన్ సెల్వరాజు, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులతో కలిసి చైర్మన్ 11వ క్లస్టర్ పరిధిలోని 9వ వార్డు మోడ్రన్ కాలనీ ప్రాంతంలో పర్యటిస్తూ, అక్కడి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.