రాజేంద్రనగర్: పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పేకాట ఆడుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పహాడషరీఫ్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మామిడిపల్లి రంగనాయకుల కాలనీకి చెందిన ఆరుగురు యువకులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8,100 నగదు, 4 సెల్ ఫోన్లు, రెండు సెట్ల కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు