దుబ్బాక: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR ద్వారా పట్టుకొని బాధితునికి అప్పగించిన భూOపల్లి ఎస్ఐ రవికాంత్ రావు
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో భూంపల్లి పోలీసులు ఫోన్ స్వాధీనం చేసుకుని, తిరిగి బాధితునికి అప్పగించినట్లు ఎస్సై రవికాంత్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన లగిశెట్టి నర్సింలు అనే వ్యక్తి తన Redmi 9A ఫోను ను నెల రోజుల కిందట అక్బర్ పేట గ్రామంలో పోగొట్టుకున్నారు. అయితే ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేశాడు. ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలు భూంపల్లి పోలీసులకు చేరడంతో బాధితునికి అప్పగించినట్లు తెలిపారు.