గొల్లపల్లి: రంగదామునిపల్లె గ్రామంలో కాలభైరవుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మండలం రంగధామునిపల్లె గ్రామంలోని శ్రీ కాలభైరవ దేవాలయంలో మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.