పీలేరు మండలం పీలేరు పట్టణంలోని ఏపీఐఐసీ-1 కాలనీలో జరుగుతున్న గృహనిర్మాణ పనులను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపి, వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణాల పై సమగ్రంగా వివరాలు సేకరించారు. హౌసింగ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు గృహ నిర్మాణాల ప్రస్తుత స్థితిపై వివరిస్తూ... మొత్తం ప్లాట్లు 1118 అని, మంజూరు చేసిన గృహాలు 662 అని, పూర్తి అయిన గృహాలు 144 అని మిగిలిన గృహాలు వివిధ దశలలో ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న గృహాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యల పై ఆరా తీశారు