లోలూరు వద్ద ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ తగిలి ఉత్తర ప్రదేశ్ కు చెందిన కార్మికుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె సమీపంలో ఉన్న లోలూరు వద్ద ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ తగలడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.