అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో బుధవారం జరిగిన అంబరాన్నంటిన దేవమ్మ దేవి జాతర మహోత్సవం.. జాతరలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు బోనాలను సమర్పించి జంతుబలి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో దాదాపు రెండు వందల సంవత్సరాల తరువాత గ్రామ జాతరను నిర్వహించడంతో పెద్ద ఎత్తున భక్త జనం తరలివచ్చారు. జాతర కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అనంతపురం హిందూపురం పార్లమెంట్ సభ్యులు తదితరులు రాకెట్ల గ్రామ జాతరకు తరలివచ్చారు.