పాములపాడు వద్ద నేషనల్ హైవే రోడ్డుకు అనుబంధంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి,ఈ సమస్యను స్థానిక స్థలాల యజమానులతో చర్చించి స్నేహపూర్వకంగాపరిష్కరించినట్లు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి తెలియజేశారు, ఈ సందర్భంగా ఎమ్మార్వో, నేషనల్ హైవే అధికారులతో సమావేశమై సర్వీస్ రోడ్డు ఏర్పాటుపై చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు, త్వరలోనే సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు, ఈ సర్వీస్ రోడ్డుతో రెండు మండలాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని మాజీ MLA లబ్బి అన్నారు,