దుబ్బాక: గంభీర్పూర్లో కరికె రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన MLC రఘోత్తంరెడ్డి, పలువురు నాయకులు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్లో బీఆర్ఎస్ నాయకులు కరికె భీమసేన పితృవియోగం తో బాధపడుతున్న విషయం తెలుసుకుని శుక్రవారం వారిని ఉపాధ్యాయ MLC కూర రాఘోత్తం రెడ్డి, మాజీ MLC ఫరూక్ హుస్సేన్, PRTC జిల్లా జనరల్ సెక్రటరి మలుగారి ఇంద్రశేనా రెడ్డి తదితరులు పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.