అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని ఊటకల్లు గ్రామంలో రెన్యూ సోలార్ ప్రాజెక్టు సంస్థకు సంబంధించిన ఏబీ ఇన్ఫ్రా సంస్థ రైతులకు పరిహారం చెల్లించడంతో వివాదం సద్దుమణిగి శుక్రవారం విద్యుత్ హైటెన్షన్ తీగలకు సంబంధించిన పనులు యధావిధిగా కొనసాగాయి. గ్రామంలోని వ్యవసాయ పొలాల మీదుగా వెళ్తున్న విద్యుత్ హైటెన్షన్ తీగలకు సంబంధించి పరిహారం చెల్లించి పనులను చేపట్టాలని రైతులు అడ్డుకున్నారు. ఏబీ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో చర్చలు జరిపి పరిహారం ఖాతాలలో జమ చేయడంతో వివాదం సద్దుమణిగింది.