కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్టాండ్ అధ్వానం, ఇబ్బందులు పడుతున్న బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. బస్టాండ్ లో ఒకవైపు సీసీ రోడ్డు వేశారు. మరోవైపు మట్టి రోడ్డు ఉంది. ఈ మట్టి రోడ్డుపై సీసీ రోడ్డు వేయలేదు. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము విపరీతంగా లేస్తున్నది. దుమ్ము కళ్ల లోకి పడుతున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.