ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ని కేంద్రం పునరుద్ధరించడం ప్రజా ఉద్యమానికి ప్రతిఫలం ఆర్డిటిఅఖిలపక్షకమిటీ కన్వీనర్ సాకే హరి
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ని కేంద్రం పునరుద్ధరించడం ప్రజా ఉద్యమానికి ప్రతిఫలం అని ఆర్డిటి అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పాకే హరి అన్నారు.ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ ప్రకటించినందుకు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలోకలెక్టర్ కార్యాలయం వద్ద విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ పాల్గొని కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లాలో పేద ప్రజలకు అన్ని తానే సేవలు చేస్తున్న ఆర్డిటికీ కష్టం వస్తే ప్రజలంతా అండగా నిలిచారన్నారు. ఉద్యమాల బాటతోనే ఎఫ్ సి ఆర్ ఏ సాధించామన్నారు దీనికి అధికార పార్టీ పెద్దల అండదండలు ఉండటం సంతోషకరమన్నారు.