అనపర్తి: లక్ష్మీ నరసాపురంలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలో బుధవారం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సిసి రహదారులు, వాటర్ ట్యాంక్, గ్రామ సచివాలయం,ఆర్ బి కే, వెల్నెస్ సెంటర్ భవనాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇల్లపట్టాలను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.