కామారెడ్డి: టీడబ్ల్యూజే జిల్లా తృతీయ మహాసభకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి జర్నలిస్టులు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. జిల్లా కన్వీనింగ్