రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో బార్య ను బండరాయితో మోది హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. ఈనెల 17 న తెల్లవారుజామున శివగంగమ్మ(49)ను భర్త సుంకన్న మద్యానికి డబ్బు ఇవ్వలేదనే కారణంతో బండరాయితో తలపై కొట్టాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు సుంకన్నను అరెస్టు చేశామన్నారు. కోర్టు కు హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.