అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో లక్ష్మమ్మ గుడి ఎదురుగా విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టి ఆపకుండా వెళ్ళిపోయిన కంటైనర్ లారీ డ్రైవర్ ఆనంద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కంటైనర్ లారీ లోడుతో బెంగళూరుకు బయలుదేరాడు. డ్రైవర్ ఆనంద్ రెడ్డి మద్యం మత్తులో ఉండి తూగుతూ గుత్తి వైపునకు వెళ్తూ లక్ష్మమ్మ గుడి ఎదురుగా రోడ్డు డివైడర్ పైకి లారి ఎక్కించి ప్రమాదానికి కారణమయ్యాడు. దీంతో స్థానికులు డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.