ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : చిలుపూర్ ఆలయంలో వెంకటేశ్వరుడికి అష్టదళ పాదపద్మారాధన సేవ
చిలుపూర్ శ్రీ బొగుల వెంకటేశ్వరుడి ఆలయంలో వెంకటేశ్వరుడికి అష్టదళ పాదపద్మారాధన సేవ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అర్చకులు నిర్వహించారు. ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మరాధన సేవ, బంగారు పద్మాల తో అర్చకులు పూజలు నిర్వహించారు .వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి మక్కువలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో లక్ష్మీప్రసన్న అర్చకులు రవీంద్ర శర్మ, సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.