శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్న రాగిమాకులపల్లి గ్రామానికి చెందిన కే సాయినాథ్ నాయక్ అనే విద్యార్థి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.